
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని సర్వే నంబర్ 613లో ఉన్న సుమారు 274 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేట్ కంపెనీల ఆధీనంలోకి వెళ్లింది.
ఈ భూమి రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ, ఏక్యూ స్కేర్ వంటి సంస్థలు దీనిని స్వాధీనం చేసుకున్నాయి.
గతంలో ఎకరాకు రూ.5 లక్షలు ఇచ్చిన కంపెనీలు, ఇప్పుడు రైతులను బెదిరించి ఎకరాకు రూ.30 లక్షలతో రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం.