
కెనడాకు చెందిన 16 ఏళ్ల ఇవాన్ బుడ్జ్, నీటిలోని మైక్రోప్లాస్టిక్‌లను 94 శాతం కచ్చితత్వంతో గుర్తించగల ఏఐ ఆధారిత రోబో తాబేలును రూపొందించాడు.
ఈ వినూత్న ఆవిష్కరణకు గాను ఇవాన్‌కు రీజెనెరాన్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫెయిర్ (ISEF)లో ప్రతిష్ఠాత్మక గోర్డాన్ ఇ. మూర్ అవార్డు లభించింది.
తాబేలు ఈత సామర్థ్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని తయారు చేసిన ఈ రోబో, 3డీ హోలోగ్రాఫిక్ సిస్టమ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో పనిచేస్తుంది.