
దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్లను పెట్టుబడి విషయాలలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ సెబీ 'ప్రాజెక్ట్ జాగరూక్'కు తెరతీసింది.
ఫైనాన్షియల్ సలహాలతో ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫిన్ఫ్లుయర్స్, చట్టవిరుద్ధ టిప్స్ మరియు భారీ రిటర్నుల హామీల పట్ల అవగాహన పెంచేందుకు దీన్ని ప్రారంభించినట్లు సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు.
ఎవరో సలహా ఇచ్చారనో లేదా అందరూ లావాదేవీలు చేస్తున్నారనో గుడ్డిగా పెట్టుబడులు పెట్టొద్దని ఆయన ఇన్వెస్టర్లకు సూచించారు.