
జీవనశైలి మార్పుల వల్ల 30-35 ఏళ్ల వయసులోనే ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సమస్యలు పెరుగుతున్నాయని, జిల్లాలో 20 శాతానికి పైగా యువత కీళ్ల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు.
గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్ మరియు కూల్ డ్రింక్స్ వినియోగం వల్ల ఎముకల సాంద్రత తగ్గి కాల్షియం హరించుకుపోతోంది.
సూర్యరశ్మి తగలకపోవడం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతోందని, ప్రతిరోజూ 15-20 నిమిషాల ఎండలో నడక, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.