
ఇటీవల ఆడిన 10 ఇన్నింగ్స్‌ల్లో 8 సార్లు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన జో రూట్, ఈ సమస్యను అధిగమించే సత్తా తనకు ఉందని ధీమా వ్యక్తం చేశాడు.
టెస్టు క్రికెట్‌లో 14 వేలకు పైగా పరుగులు చేసిన అనుభవం తనకు ఉందని, అంపైర్స్ కాల్ నిర్ణయాలు కూడా తన వైఫల్యాలకు కారణమని పేర్కొన్నాడు.
ఈ ఏడాది ఉపయోగిస్తున్న డ్యూక్స్ బంతుల్లో మార్పులు ఉండటం వల్ల బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారని రూట్ అభిప్రాయపడ్డాడు.