
రాఖీ పండుగ సందర్భంగా శుక్రవారం మంత్రులు కొండా సురేఖ మరియు సీతక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టారు.
ఈ మంత్రులు ఇద్దరూ విడివిడిగా జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీలు ధరింపజేశారు.
రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్న వీరు, పండుగ వేళ సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.