
గ్లాస్గోలో 11 రోజుల పాటు జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఆదివారం ముగియనుండగా, 2030 శతాబ్ది ఎడిషన్ క్రీడల ఆతిథ్య హక్కులను భారత్ అధికారికంగా స్వీకరించనుంది.
ఆగస్టు 3న తెల్లవారుజామున 1:30 గంటలకు జరిగే ముగింపు వేడుకల్లో గుజరాత్ డిప్యూటీ సీఎం హర్ష్ సంఘ్వీ నేతృత్వంలోని బృందం కామన్వెల్త్ జెండాను స్వీకరిస్తుంది.
అహ్మదాబాద్ వేదికగా జరగనున్న 2030 క్రీడల కోసం ఈ వేడుకల్లో శంకర్ మహదేవన్ బృందం ప్రదర్శనలు మరియు భారత సాంస్కృతిక వైభవాన్ని చాటే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.