
హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఉన్న గర్భిణి నుంచి ప్రసవ సమయంలో బిడ్డకు వైరస్ సంక్రమించే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.
గర్భధారణ సమయంలోనే ఈ పరీక్ష చేయించుకుని, వైరల్ లోడ్ ఆధారంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
వైద్యుల సూచన మేరకు టెనోఫోవిర్ వాడటంతో పాటు పుట్టిన వెంటనే బిడ్డకు వ్యాక్సిన్ ఇప్పించాలని డాక్టర్ శారద వాణి సూచించారు.