
18 ఏళ్ల యువ పేసర్ దీపేష్ దేవేంద్రన్ టీఎన్‌పీఎల్ అరంగేట్రం మ్యాచ్‌లో గంటకు 146 కి.మీ వేగంతో బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
మధురై పాంథర్స్ తరపున ఆడిన దీపేష్, తన 4 ఓవర్ల కోటాలో 25 పరుగులిచ్చి 1 వికెట్ తీయడమే కాకుండా, కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు.
గతంలో అండర్-19 ప్రపంచకప్‌లో 4 వికెట్లు, ఆసియా కప్‌లో 5 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసిన దీపేష్, టీమిండియా భవిష్యత్తు పేస్ గుర్రంగా గుర్తింపు పొందుతున్నాడు.