
అమెరికాలోని కాలిఫోర్నియాలో పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్లో ఉన్న టెస్లా కారు మూసి ఉన్న హైవేలోకి దూసుకెళ్లి పోలీసుల వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలు కాగా, వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో తాను కారును సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్లో పెట్టి నిద్రపోయానని డ్రైవర్ తెలిపాడు.