
తమిళనాడులో అధికారంలోకి వచ్చిన టీవీకే ప్రభుత్వం, గత డీఎంకే పాలనలో రైతులు మరియు ఉపాధ్యాయులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు సీఎం విజయ్ ప్రకటించారు.
2021 మే నుంచి 2026 మధ్య కాలంలో సిప్కాట్, పరందూర్ విమానాశ్రయం ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై అప్పటి ప్రభుత్వం కేసులు నమోదు చేసిందని విజయ్ విమర్శించారు.
ప్రజల న్యాయమైన డిమాండ్లకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్న విజయ్, ఈ నిర్ణయం ద్వారా నిరసనకారులకు భారీ ఊరట కల్పించారు.