
భారత యువ స్పిన్నర్ శ్రీ చరణి ఐసీసీ మహిళల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌లోనే అత్యుత్తమంగా 817 రేటింగ్ పాయింట్లకు చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించింది.
ఈ క్రమంలో 2018 నవంబర్‌లో ఆస్ట్రేలియా బౌలర్ మేగన్ షట్ సాధించిన 806 పాయింట్ల రికార్డును ఆమె అధిగమించింది.
ఆసియా క్రీడల్లో జపాన్‌పై 4/10తో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయడంతో పాటు టోర్నీలో మొత్తం 12 వికెట్లు పడగొట్టి భారత్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది.