
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఏపీ జూడో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకట్ నామిశెట్టి స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంతో విశాఖ ఎంపీ శ్రీభరత్‌కు ఎటువంటి సంబంధం లేదని, ఆయన పేరును అనవసరంగా ముడిపెడుతున్నారని తెలిపారు.
ప్రభుత్వంపై బురద చల్లేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, నిరూపించకపోతే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.