
మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఐఫోన్ యాప్ తరహాలో క్రింది నావిగేషన్ బార్ డిజైన్‌ను మార్చేందుకు పరీక్షలు మొదలుపెట్టింది.
వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.26.38.10 లో చాట్స్, కమ్యూనిటీస్, అప్డేట్స్ ట్యాబ్‌లు ఫ్లోటింగ్ రూపంలో గుండ్రని అంచులతో కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ ఫీచర్ అంతర్గత టెస్టింగ్ దశలోనే ఉందని, ఆండ్రాయిడ్ యూజర్ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.