స్టీఫెన్ ఫ్లెమింగ్ వైదొలగడంతో చెన్నై సూపర్ కింగ్స్ కొత్త హెడ్ కోచ్గా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పేరు రేసులో ఉందని అశ్విన్ తెలిపారు.
బ్రెండన్ మెక్కల్లమ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ, సీఎస్కే మేనేజ్మెంట్ మోర్గాన్ వైపే మొగ్గు చూపుతోందని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో పేర్కొన్నారు.
గత రెండు సీజన్లలో పేలవ ప్రదర్శన నేపథ్యంలో, పరిస్థితులు చక్కబడే వరకు ధోనీ కనీసం ఒక్క ఏడాది కెప్టెన్గా కొనసాగాలని అశ్విన్ సూచించారు.