
తెలంగాణలో పునరుత్పాదక శక్తి రంగాన్ని బలోపేతం చేసేందుకు రిజర్వాయర్లపై ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, సుంకాల కారణంగా ఒక్క మెగావాట్ ప్రాజెక్టుపై దాదాపు రూ. 1.30 కోట్ల మేర అదనపు భారం పడుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 19,000 మెగావాట్లకు చేరగా, సబ్సిడీల కోసం ఏటా రూ. 19,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది.