వినియోగదారులను తప్పుదోవ పట్టించే మోసపూరిత పద్ధతులకు అడ్డుకట్ట వేయడానికి కన్సూమర్ ప్రొటెక్షన్ ఇ-కామర్స్ సవరణ నిబంధనలను కేంద్రం నోటిఫై చేసింది.
ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమలులోకి రానుండగా, డిస్కౌంట్ ప్రకటించినప్పుడు గత 30 రోజుల్లోని అత్యల్ప ధరను ప్రయర్ ప్రైస్‌గా చూపాలి.
ప్రతి ఇ-కామర్స్ కంపెనీ నేషనల్ కన్సూమర్ హెల్ప్‌లైన్ సిస్టమ్‌తో లింక్ కావడంతో పాటు స్వీయ ఆడిట్ నిర్వహించి సర్టిఫికెట్ పెట్టాలని షరతు పెట్టారు.