
హైదరాబాద్‌లోని అజామాబాద్‌లో ఉన్న రూ.500 కోట్ల విలువైన ఆయిల్‌ఫెడ్ భూములను కేవలం రూ.87 కోట్లకే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని ప్రభుత్వం చూస్తోందని హరీశ్ రావు ఆరోపించారు.
ఈ భూ కేటాయింపులను వెంటనే రద్దు చేసి, ఆ భూములపై ఆయిల్‌ఫెడ్‌కు ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించాలని కోరుతూ ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
1987లో సుప్రీంకోర్టు ఈ భూములు ప్రభుత్వానివేనని స్పష్టం చేసినప్పటికీ, కమీషన్ల కోసం ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కుతోందని ఆయన విమర్శించారు.