
విశాఖ జిల్లా ఆనందపురం మండలం జగన్నాథపురంలో రూ. 58,743 కోట్ల పెట్టుబడితో 486 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ ప్రాజెక్టు కోసం 385 ఎకరాల భూమిని కేటాయించగా, స్థానిక రైతులు మరియు ప్రజా సంఘాలు పర్యావరణ సమస్యల దృష్ట్యా దీనిని వ్యతిరేకిస్తున్నాయి.
గతంలో గ్రేహౌండ్స్ కోసం సేకరించిన ఈ భూములను ఇప్పుడు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడంపై స్థానికంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.