
ఆర్బీఐ పరపతి విధాన కమిటీ మూడు రోజుల సమావేశం సోమవారం ప్రారంభమైంది.
ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు అడ్డుకట్ట వేసేందుకు ఈసారి పావు శాతం రేట్ల పెంపు ఉండొచ్చని 16 మంది ఆర్థికవేత్తలు, బ్యాంకర్లు అభిప్రాయపడ్డారు.
ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 8 నెలల గరిష్టమైన 4.82 శాతానికి ఎగబాకిన నేపథ్యంలో బుధవారం తీసుకోబోయే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.