
న్యూయార్క్‌లో ఆదివారం ప్రారంభం కానున్న యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో గంజాయి వాసన ఆటగాళ్లకు ఇబ్బందిగా మారింది.
బ్రిటన్ ప్లేయర్ కేటీ బౌల్టర్ ప్రాక్టీస్ సమయంలో గంజాయి వాసన ఏకాగ్రతను దెబ్బతీస్తోందని బహిరంగంగా అసహనం వ్యక్తం చేశారు.
న్యూయార్క్‌లో 21 ఏళ్లు పైబడిన వారికి గంజాయి వినియోగం చట్టబద్ధం కావడంతో ఈ సమస్య తలెత్తుతోందని నిర్వాహకులు పేర్కొన్నారు.