
హైదరాబాద్ నాంపల్లి బజార్ ఘాట్లో క్రిప్టోకరెన్సీ మార్పిడి పేరుతో రూ.21 లక్షలను దుండగులు దోచుకున్నారు.
రూ.25 లక్షలను క్రిప్టోకరెన్సీగా మార్చడానికి వెళ్లిన అమరేంద్ర అనే బాధితుడి కళ్లలో నిందితులు పెప్పర్ స్ప్రే కొట్టి దాడికి పాల్పడ్డారు.
నిందితులను పట్టుకునే యత్నంలో రూ.4 లక్షలు కిందపడిపోగా, మిగిలిన రూ.21 లక్షలతో వారు పరారయ్యారు.