
ప్రముఖ తెలుగు నటుడు, నిర్మాత గుళ్లపల్లి వెంకట నారాయణరావు (73) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని తన నివాసంలో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
ఆయన తన కెరీర్‌లో వందకు పైగా సినిమాల్లో నటించడంతో పాటు పలు ధారావాహికల్లో కూడా కీలక పాత్రలు పోషించారు.
నారాయణరావు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.