
హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ కాలనీలో పేదల కోసం నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం భూమిపూజ చేశారు.
తొలి దశలో లక్ష ఇళ్లను అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు, పట్టణ పేదల సొంతింటి కలను నిజం చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని సీఎం తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం రూ.12 వేల కోట్లు, స్వయం సహాయక సంఘాలకు రూ.65 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని ప్రభుత్వం వెల్లడించింది.