ఇందిరమ్మ టవర్ల ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునే నిబంధనలను ప్రభుత్వం సరళతరం చేస్తూ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై ఆధార్ కార్డుతో పాటు ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ లేదా బ్యాంకు పాస్‌బుక్‌లలో ఏదైనా ఒకదానిని నివాస ధ్రువీకరణ పత్రంగా సమర్పించవచ్చు.
దరఖాస్తుదారులు ఫారమ్‌లో 12 అంకెల ఆధార్ నంబరును తప్పనిసరిగా నమోదు చేయాలని అధికారులు స్పష్టం చేశారు.