
వెస్టిండీస్ సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు నేరుగా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది.
ఈ పర్యటనలో భాగంగా జరిగే టెస్టు సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ భారత్-ఏ తరఫున ఒక అనధికారిక టెస్టులో ఆడనున్నారు.
బీసీసీఐ త్వరలోనే టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లతో పాటు 'ఏ' జట్టు వివరాలను అధికారికంగా ప్రకటించనుంది.