
ప్రకాశం జిల్లా దర్శిలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల కోసం జనసేన నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.
మున్సిపల్ అధికారుల ద్వారా ఫ్లెక్సీలను తొలగించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించగా, జనసేన కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు.
స్థానిక రాజకీయ వర్గాల మధ్య జరిగిన ఈ ఘర్షణతో దర్శి పట్టణంలో కొంతసేపు గందరగోళం ఏర్పడింది.