
అమరావతిలో 8.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.730.70 కోట్ల వ్యయంతో దేశంలోనే తొలి క్వాంటమ్ అండ్ ఏఐ యూనివర్సిటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నారు.
సెప్టెంబరు 13 నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో తాత్కాలికంగా తరగతులు ప్రారంభం కానున్నాయని అధికారులు తెలిపారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ఐదేళ్లలో 8,250 మంది విద్యార్థులకు క్వాంటమ్ టెక్నాలజీ, సెమీకండక్టర్ డిజైన్ వంటి రంగాల్లో శిక్షణ అందించనున్నారు.