ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన నేపధ్యంలో, వైఎస్సార్సీపీ తొలి విడతగా 7 కార్పొరేషన్ల మేయర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
విజయవాడ మేయర్గా రాయన భాగ్యలక్ష్మి, తిరుపతి మేయర్గా శిరీషలకు మరోసారి అవకాశం కల్పించగా, విశాఖపట్నం మేయర్ అభ్యర్థిగా వరుదు కల్యాణిని ప్రకటించారు.
రాష్ట్రంలో అక్టోబర్ 28న పోలింగ్ జరగనుండగా, విజయనగరం కార్పొరేషన్ పోలింగ్ తేదీని 29కి మార్చాలని జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు.