
జపాన్లోని కనోయా వైమానిక స్థావరంలో అమెరికా 'టైఫాన్' క్షిపణి వ్యవస్థలను మోహరించడంపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ వ్యవస్థ ద్వారా 1,600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల తొమాహాక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించే అవకాశం ఉందని రష్యా ఆందోళన వ్యక్తం చేసింది.
జపాన్ తన శాంతియుత విధానానికి కట్టుబడి ఉండాలని, ఈ చర్య తమ జాతీయ భద్రతకు ముప్పు అని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా హెచ్చరించారు.