
IVF చికిత్స విజయవంతం కావడానికి మహిళ వయసు, అండాల నాణ్యతతో పాటు పురుషుల వీర్యకణాల ఆరోగ్యం కూడా కీలకమని నిపుణులు సూచిస్తున్నారు.
చికిత్సకు సిద్ధమవుతున్న దంపతులు ఆకుకూరలు, తాజా పండ్లు, తృణధాన్యాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలని తెలిపారు.
శారీరక చురుకుదనం కోసం తేలికపాటి వ్యాయామం, యోగా చేయడంతో పాటు తగినంత నిద్ర, ఒత్తిడిని తగ్గించుకోవడం అవసరమని పేర్కొన్నారు.