
భారతదేశంలో విద్యుత్ వాహన (ఈవీ) రంగం వేగంగా విస్తరిస్తుండటంతో రాబోయే రోజుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువతకు భారీ అవకాశాలు లభించనున్నాయి.
ప్రముఖ మానవ వనరుల సంస్థ అడెక్కో ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2030 నాటికి ఈవీ రంగంలో ఏకంగా 3 నుండి 4 కోట్ల ఉద్యోగాల కల్పన జరగనుంది.
పర్యావరణ అనుకూల రవాణా దిశగా పరిశ్రమలు అడుగులు వేస్తుండటంతో, ఈ రంగంలో సాంకేతిక మరియు ఉత్పాదక విభాగాల్లో నియామకాలు భారీగా పెరగనున్నాయి.