
దేశవ్యాప్తంగా ఐఐటీల్లో భర్తీ అయిన సీట్లలో నాల్గో వంతుకుపైగా ఐఐటీ మద్రాస్ జోన్ విద్యార్థులే దక్కించుకున్నారు.
ఈ జోన్ పరిధిలోకి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ప్రాంతాల విద్యార్థులు వస్తారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాలలో ఈ జోన్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.