
తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో కళ్లద్దాల్లో అమర్చిన రహస్య కెమెరాలతో ఫొటోలు తీస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు.
నిందితులు కళ్లజోళ్లలో కెమెరాలను అమర్చి ఆలయ ప్రాంగణంలో అక్రమంగా ఫొటోలు తీస్తుండగా పట్టుబడ్డారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.