
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-18 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది.
ఈ రాకెట్ ద్వారా దేశ స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ 'నావిక్' సేవలను బలోపేతం చేసే ఎన్‌వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు.
ఈ ఉపగ్రహంలో స్వదేశీ, విదేశీ అణుగడియారాలను అమర్చడంతో పాటు సరిహద్దు చుట్టూ 1,500 కి.మీ. మేర లొకేషన్ సమాచారాన్ని అందించేలా ఏర్పాట్లు చేశారు.