
దేశాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చే లక్ష్యంతో ప్రధాని మోదీ 'నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్'ను ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించారు.
ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా 100 వారాల పాటు కొనసాగుతుందని, ప్రతి ఆదివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రధాని ప్రకటించారు.
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, వ్యసనాల నుంచి బయటపడేందుకు యోగా, ధ్యానం సహాయపడతాయని ఆయన సూచించారు.