Health & Environment

ఫ్లూ లక్షణాలు మూడు రోజులకు మించితే వైద్యులను సంప్రదించాలి

sakshi2h
THE BRIEF
1

జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి ఫ్లూ లక్షణాలు మూడు రోజుల కంటే ఎక్కువ కాలం వేధిస్తే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని డాక్టర్ నాగేందర్ సూచించారు.

2

మధుమేహులు, గర్భిణులు, వృద్ధులు, కిడ్నీ లేదా కాలేయ మార్పిడి చికిత్సలు చేయించుకున్న వారు ఫ్లూ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించారు.

3

స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నవారు తుమ్మినా, దగ్గినా రుమాలు అడ్డుపెట్టుకోవాలని, బయట నుంచి వచ్చినప్పుడు చేతులు, కాళ్లను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచించారు.