
అమెరికా యుద్ధనౌకలను లక్ష్యంగా చేసుకోగల సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల అభివృద్ధిలో ఇరాన్‌కు రష్యా రహస్యంగా సాంకేతిక సహకారం అందిస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది.
2023లో ప్రారంభమైన ఈ రహస్య ప్రాజెక్టుకు 'సీ430ఎల్' అని కోడ్‌నేమ్ పెట్టారని, రష్యా నిపుణులు రామ్‌జెట్ ప్రొపల్షన్ సాంకేతికతను ఇరాన్‌తో పంచుకున్నారని సమాచారం.
ఈ సాంకేతికతతో రూపొందే క్షిపణులు శబ్ద వేగం కంటే అధిక వేగంతో ప్రయాణించగలవు, ఇది పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా నౌకాదళానికి కొత్త ముప్పుగా మారే అవకాశం ఉంది.