
ఉపాధి కోసం రష్యా వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయి రష్యా సైన్యంలో చిక్కుకున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురు తెలంగాణ వాసులను సురక్షితంగా రప్పించాలని కుటుంబ సభ్యులు కోరారు.
మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మికి వారు వినతిపత్రం అందజేశారు.
ఈ నలుగురు బాధితులకు అవసరమైన దౌత్య సహాయం అందించి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు మాస్కోలోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.