హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) ఎంపిక చేసిన టెన్యూర్లపై 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది.
ఈ కొత్త వడ్డీ రేట్లు 2026, సెప్టెంబర్ 7 నుంచి అమల్లోకి వస్తాయని, దీనివల్ల లోన్ ఈఎంఐలు తగ్గే అవకాశం ఉందని బ్యాంక్ ప్రకటించింది.
సవరించిన తర్వాత ఓవర్‌నైట్, ఒక నెల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ 8 శాతం నుంచి 7.90 శాతానికి, ఏడాది టెన్యూర్ రేటు 8.40 శాతం నుంచి 8.35 శాతానికి పడిపోయాయి.