
గత విద్యాసంవత్సరం ముగింపు నాటికే అందాల్సిన విద్యార్థుల ఏకరూప వస్త్రాలు (యూనిఫాం) ఇప్పటికీ పాఠశాలలకు చేరలేదు.
దీనివల్ల విద్యార్థులు పంద్రాగస్టు వేడుకలకు కూడా పాత దుస్తులనే ధరించి హాజరు కావాలని పాఠశాలల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
ఏకరూప వస్త్రాల సరఫరాలో జాప్యం జరగడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.