
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అతిపెద్ద ఇన్వెస్టరైన సాఫ్ట్‌బ్యాంక్ సీఈఓ మసయోషి సన్ ఏఐ భవిష్యత్తుపై కీలక హెచ్చరికలు జారీ చేశారు.
సూపర్ ఇంటెలిజెన్స్ తప్పుడు చేతుల్లోకి వెళితే అది అత్యంత ప్రమాదకరంగా మారుతుందని క్యోటోలో జరిగిన సదస్సులో ఆయన పేర్కొన్నారు.
ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.