
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ ఫొటోను, పేరును అధికారులు తొలగించారు.
సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క పాల్గొనగా, స్థానిక మంత్రి అయిన కొండా సురేఖ హాజరుకాకపోవడం గమనార్హం.
మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.