
అసెంబ్లీకి హాజరుకాకుండా జీతాలు తీసుకుంటున్న ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సీట్ల వద్ద కెమెరాలను ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే తన సీటులో ఉన్నప్పుడే సభకు హాజరైనట్లు పరిగణించే కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు మంగళవారం తునిలో ఆయన వెల్లడించారు.
రానున్న అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించేందుకు ఈ నెల 17న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు స్పీకర్ ప్రకటించారు.