గత ఆర్థిక సంవత్సరం 2025-26లో మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా ఏకంగా 731 మ్యూచువల్ ఫండ్ పథకాలు నెగెటివ్ రిటర్న్స్‌ను నమోదు చేశాయని సెబీ గణాంకాలు వెల్లడించాయి.
మొత్తం 1841 స్కీమ్స్‌లో 40 శాతం ఫండ్స్ నష్టాలను మిగిల్చగా, 10 శాతం కంటే ఎక్కువ నష్టపోయిన పథకాల సంఖ్య 30 నుంచి 93కు పెరిగింది.
ప్రస్తుతం 10.45 కోట్ల ఎస్ఐపీ ఖాతాల ద్వారా నెలకు రూ.16,413 కోట్ల పెట్టుబడులు వస్తున్నప్పటికీ, ఇన్వెస్టర్లు 12-15 శాతం రాబడి ఆశించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.