
జర్మనీకి చెందిన ప్రముఖ విలాసవంతమైన పోర్షే కార్ల సంస్థలో భారీగా ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.
ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ చేపడుతున్న పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఈ కోతను ప్రతిపాదించారు.
ఈ ప్రణాళిక ద్వారా పోర్షే బ్రాండ్‌లో సుమారు 4,000 మంది ఉద్యోగులను తగ్గించాలని చూస్తున్నట్లు జర్మనీ పత్రిక వెల్లడించింది.