
భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రత్యామ్నాయాలను వెతకడం మానుకోవాలని మాజీ క్రికెటర్ సునీల్ గవస్కర్ టీమ్ మేనేజ్మెంట్కు సూచించారు.
హార్దిక్ లాంటి ఆటగాడిని దొరకబట్టడం అసాధ్యమని, బ్యాటింగ్ తో పాటు బౌలింగ్లో రాణించగల నమన్ ధీర్ వంటి భిన్నమైన నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు.
వెస్టిండీస్తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్లో నమన్ ధీర్ ఆరు బంతుల్లోనే అజేయంగా 24 పరుగులు చేసి తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడని గవస్కర్ గుర్తుచేశారు.