కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను కించపరిచేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణలపై మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది.
టీడీపీ నేత మద్దిరాల మ్యానీ చేసిన ఫిర్యాదు మేరకు మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో ఈ కేసు నమోదైంది.
గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబు 18 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు.