
హైదరాబాద్లో అంజయ్యనగర్ భవన ప్రమాదం నేపథ్యంలో, సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో అధికారులు మంగళవారం ఒక్కరోజే 17 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.
శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లలో మొత్తం 54 అక్రమ నిర్మాణాలను గుర్తించగా, మరో 11 భవనాలకు యూసీ నోటీసులు జారీ చేశారు.
అంజయ్యనగర్ ఘటనలో నాసిరకం నిర్మాణానికి బాధ్యుడైన కాంట్రాక్టర్ మహ్మద్ ఖాజామియాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.