
గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలను నమోదు చేశాయి.
సెన్సెక్స్ 905.01 పాయింట్లు లాభపడి 74,151.04 వద్ద ముగియగా, నిఫ్టీ 237.90 పాయింట్లు పెరిగి 22,936.75 వద్ద స్థిరపడింది.
బిర్లాసాఫ్ట్, రిలయన్స్ పవర్, పూనావాలా ఫిన్‌కార్ప్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి.